Eatala Rajender: హిందూ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తే కాలగర్భంలోకే.. ఈటల హెచ్చరిక

ముత్యాలమ్మ తల్లి విగ్రహ పునః ప్రతిష్ట కార్యక్రమంలో ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు.

Update: 2024-12-11 06:26 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రజల విశ్వాసాల తో చెలగాటడం సరికాదని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajender) ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కొంతమంది దుర్మార్గులు హిందూ ధర్మానికి (Hindu Dharma) వ్యతిరేకంగా, హిందూ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తూ సికింద్రాబాద్ కుమ్మరిగూడ ముత్యాలమ్మ ఆలయం (Mutyalamma temple) మీద దాడి చేశారని ధ్వజమెత్తారు. నిందితులను ఈ ప్రాంత ప్రజలు పట్టుకుని పోలీసులుకు అప్పగిస్తే రోజులు గడిచినా ఇక్కడి ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా ప్రభుత్వం నిమ్మకునీరెత్తనట్లుగా వ్యవహరించిదంని ఆరోపించారు. బుధవారం కుమ్మరిగూడలోని శ్రీ ముత్యాలమ్మ తల్లి విగ్రహ పునః ప్రతిష్ట కార్యక్రమంలో ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అహంకారపూరితంగా ప్రజలకు మనోభావాలకు విరుద్ధమైన చర్యలు చేస్తే తప్పకుండా ఈ ప్రభుత్వం కూడా కాలగర్భంలో కలిసిపోతుందని హెచ్చరించారు.

చిల్లరపనులతో ప్రజాక్షేత్రంలో మంచి జరగదు:

అపవిత్రమైన ఆలయప్రాంతంలో శుద్ధి చేసేందుకు ఈ ప్రాంతవాసులు అనేక రోజులుగా దీక్షలు పూజలు నిర్వహిస్తుంటే వాటిని నిలువరించే ప్రయత్నం చేశారని ఈటల మండిపడ్డారు. దానికి కూడా ప్రభుత్వం దిగిరాకపోతే ర్యాలీ చెపట్టారని ఆ ర్యాలీ మీద అకారణంగా దుర్మార్గంగా పోలీసులు రక్తాన్ని కళ్ల చూశారన్నారు. అనేక మందిపై కేసులు పెట్టి, జైల్లో పెట్టారు. చివరికి ప్రభుత్వం దిగివచ్చి ఈ ఆలయాన్ని మళ్లీ పునః ప్రతిష్ట చేస్తామని చెప్పకతప్పలేదన్నారు. ఈ ప్రాంత ప్రజలు ఎవరు విశ్వాసాలకు తగ్గట్టుగా వారు బ్యానర్లు పెట్టుకున్నారు. కానీ ప్రభుత్వంలో ఉన్నవారు ఆదేశాలిచ్చి మున్సిపల్ అధికారుల చేత బ్యానర్లు చింపేసినట్టుగా తెలుస్తోంది. పిచ్చి వేషాలు వేసి ఇలాంటి చిల్లర పనులు చేస్తే ప్రజాక్షేత్రంలో మంచి జరగదన్నారు. ఇంత సెన్సిటివ్ ఏరియాలో రెండు రోజుల క్రితమే ఇంటెలిజెన్స్ (Intelligence) వ్యవస్థ మోహరించి కంటికి రెప్పలా చూసుకోవాలి కానీ ఇంత సెక్యూరిటీ మధ్యలో కూడా కళ్ళముందే బ్యానర్లు చింపారంటే మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తక్షణమే బాధ్యులైన వారి మీద కేసులు పెట్టి శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News