TS: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. రేపటినుంచే ప్రారంభం

బతుకమ్మ, దసరా పండుగల నేప‌థ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేటు పాఠ‌శాల‌ల‌కు శుక్రవారం నుంచి సెల‌వులు ప్రక‌టించారు. ఈనెల 26వ తేదీన పాఠ‌శాల‌లు పునఃప్రారంభం కానున్నాయని అధికారులు తెలిపారు.

Update: 2023-10-12 14:24 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: బతుకమ్మ, దసరా పండుగల నేప‌థ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేటు పాఠ‌శాల‌ల‌కు శుక్రవారం నుంచి సెల‌వులు ప్రక‌టించారు. ఈనెల 26వ తేదీన పాఠ‌శాల‌లు పునఃప్రారంభం కానున్నాయని అధికారులు తెలిపారు. ఇక ఒక‌టి నుంచి ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు స‌మ్మెటివ్ అసెస్‌మెంట్‌(ఎస్ఏ-1) ప‌రీక్షలు బుధ‌వారంతో ముగిశాయి. ఆ ప‌రీక్షల ఫ‌లితాలు సెల‌వుల అనంత‌రం వెల్లడించ‌నున్నారు. మ‌రోవైపు ఫార్మెటివ్ అసెస్‌మెంట్‌-1,2 ప‌రీక్షల మార్కుల‌ను గురువారం లోపు చైల్డ్ ఇన్ఫోలో న‌మోదు చేయాల‌ని విద్యాశాఖ ఆదేశించింది. ఇక జూనియర్‌ కాలేజీలకు ప్రభుత్వం. ఈ నెల 19 నుంచి 25 వరకు సెలవులు ప్రకటించింది.

Tags:    

Similar News