మాజీ సీఎం కేసీఆర్ ఇంటికి తాగునీటి కష్టాలు?
వేసవి కాలం రావడంతో తెలంగాణలో నీటి సమస్య పెరుగుతున్నది. దీంతో రైతులు, ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో: వేసవి కాలం రావడంతో తెలంగాణలో నీటి సమస్య పెరుగుతున్నది. దీంతో రైతులు, ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇంటికి కూడా తాగునీటి కష్టాలు తప్పడం లేదంట.. కేసీఆర్ ప్రస్తుతం ఉంటున్న ఇంటికి నీటి సమస్య ఏర్పడిందని, దీంతో నంది నగర్‌లోని కేసీఆర్ నివాసంలో వాటర్ ట్యాంకర్లు వచ్చాయి. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ దగ్గర ఉండి.. ఈ వాటర్ ట్యాంకర్లను తెప్పించారు.
ఈ నేపథ్యంలోనే ట్యాంకర్లతో నీళ్ళు పోస్తున్న వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఇది కాదా అసలైనా మార్పు అంటే అని విమర్శిస్తున్నారు.