బాబ్లీ ప్రాజెక్టు నుండి దిగువకు నీటి విడుదల (వీడియో)

బాబ్లీ ప్రాజెక్టు నుంచి దిగువన ఉన్న తెలంగాణకు అధికారులు 5 గేట్ల ద్వారా నీటిని విడుదల చేశారు.

Update: 2023-03-01 08:15 GMT

దిశ, భీమ్‌గల్: మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు నుంచి దిగువన ఉన్న తెలంగాణకు మహారాష్ట్ర - తెలంగాణ ఉభయ రాష్ట్రాల అధికారులు 5 గేట్ల ద్వారా నీటిని విడుదల చేశారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ప్రతి సంవత్సరం మార్చి ఒకటో తేదీన తాగునీటి అవసరాల నిమిత్తం 0.6 టీఎంసీ నీళ్లను విడుదల చేయాల్సి ఉంది. ఇందులో భాగంగా అధికారులు బుధవారం ఉదయం 9:30 గంటలకు దిగువకు నీళ్లను వదిలారు.

బాబ్లీ ప్రాజెక్ట్ ప్రస్తుత నీటిమట్టం 334.30 MTR, సంబంధిత సామర్థ్యం 1.07 TMCలుగా ఎస్సారెస్పీ ఈఈ చక్రపాణి తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర జల సంఘం నుంచి ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ ఎన్.శ్రీనివాస్ రావు, నాందేడ్ ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎ.యస్ చౌగలే, నాందేడ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోత్దార్, ఎస్సారెస్పీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ యం.చక్రపాణి, యం.వంశీ పాల్గొన్నారు.

Tags:    

Similar News