DOST: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ప్రవేశాల షెడ్యూల్‌లో మార్పులు

రాష్ట్రంలో కుండపోతగా వర్షాలు కురుస్తున్న కారణంగా డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ (DOST) స్పెషల్‌ డ్రైవ్‌ అడ్మిషన్ల షెడ్యూల్‌లో అధికారులు స్వల్ప మార్పులు చేశారు.

Update: 2024-09-09 16:31 GMT

దిశ, వెబ్‌‌డెస్క్: రాష్ట్రంలో కుండపోతగా వర్షాలు కురుస్తున్న కారణంగా డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ (DOST) స్పెషల్‌ డ్రైవ్‌ అడ్మిషన్ల షెడ్యూల్‌లో అధికారులు స్వల్ప మార్పులు చేశారు. ఈ మేరకు ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌ లింబాద్రి, కళాశాల విద్యా కమిషనర్‌ శ్రీదేవసేన సోమవారం రీ షెడ్యూల్‌ను విడుదల చేశారు. అర్హత గ‌ల‌ విద్యార్థులు రూ.400 చెల్లించి ఈనెల 11 లోపు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. 11 వరకు వెబ్‌ ఆప్షన్లు పెట్టుకోవచ్చి పేర్కొన్నారు. ఈ నెల 10న సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ (Certificate Verification)12న సీట్లను కేటాయించనున్నట్లు ప్రకటించారు. సీటు పొందిన వారు ఈనెల 16 వరకు సెల్ఫ్ రిపోర్టింగ్‌ పాటు, సంబంధిన కళాశాలలో రిపోర్ట్ చేయాలని అధికారులు వెల్లడించారు.


Similar News