కాంగ్రెస్ నాయకులారా.. రుణమాఫీపై ఎక్కడ తగ్గకుండా ప్రచారం చేయండి: డిప్యూటీ సీఎం భట్టి
ప్రజా భవన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రుల సమక్షంలో రుణమాఫీ పై సమావేశం నిర్వహించారు.
దిశ, వెబ్ డెస్క్: ప్రజా భవన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రుల సమక్షంలో రుణమాఫీ పై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర కాంగ్రెస్ ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రుణమాఫీ కార్యక్రమం అమలు చేసేందుకు నిద్రలేని రాత్రులు గడిపాము. రూపాయి రూపాయి పోగుచేసి ఈ కార్యక్రమం చేపడుతున్నాము. ఆగస్టు దాటకుండానే రెండు లక్షల రుణమాఫీ పూర్తి చేస్తున్నాము. అర్హులైన అన్ని కుటుంబాలకు రుణమాఫీ చేస్తాము. రేషన్ కార్డులు లేని ఆరు లక్షల మంది రైతుల కుటుంబాలకు రుణమాఫీ అందిస్తామని అన్నారు. ఈ రుణమాఫీ అమలుపై కాంగ్రెస్ నాయకులను ఉద్దేశించి భట్టి మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులారా రుణమాఫీ కార్యక్రమాన్ని ప్రతి పోలింగ్ బూత్, ప్రతి ఓటర్ దగ్గరకు కార్యక్రమాన్ని తీసుకెళ్లాలి. తల ఎత్తుకొని.. ఎక్కడ తగ్గకుండా ప్రచారం చేయాలని పార్టీ నేతలకు భట్టి దిశానిర్దేశం చేశారు.