Alleti Maheshwar Reddy: ఆ విషయంలో మాకు అనుమానం ఉంది: ఏలేటి

అసెంబ్లీలో ఏలేటి మహేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-08-02 07:20 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: టెక్నికల్ చేంజెస్ కు బదులు క్వాలిటేటివ్ చేంజెస్ కోసం రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ కు అధికారం కట్టబెట్టారని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. తెలంగాణ సంక్షిప్త పదాలు (TS ను TG) మార్పు బిల్లుపై చర్చ సందర్భంగా మాట్లాడిన ఆయన.. చిహ్నం విషయంలో 200 వరకు సూచనలు వచ్చే సరికి ఈ అంశాన్ని ప్రభుత్వం పక్కన పెట్టిందన్నారు. రాష్ట్ర చిహ్నంలో నిజాం రాచరిక పాలననాటి ఆనవాళ్లు అయిన చార్మినార్ ను కొనసాగిస్తూ హిందువులను ఏకం చేసి సంస్కృతిని ముందుకు నడిపించిన కాకతీయ రాజుల చిహ్నాలను తొలగిస్తున్నారనే అనుమానాలు మాకు ఉన్నాయన్నారు. వీటిని తొలగించవద్దని కోరారు. టీఎస్ నుంచి టీజీగా మార్చాడాన్ని బీజేపీ స్వాగతిస్తున్నదన్నారు. ఉద్యమకాలంలో అనేక మంది తెలంగాణ ప్రజలు తెలంగాణ అంటే టీజీగానే రాసుకున్నారు. ఏం జరిగిందో ఏమో కానీ ప్రభుత్వం టీఎస్ గా మార్చింది. మళ్లీ టీఎస్ స్థానంలో టీజీ తీసుకురావడం సంతోషకరం అన్నారు.

Tags:    

Similar News