మీలా ఉన్నవి కూల్చి కట్టి.. ఖజానాకు బొక్క పెట్టే టైప్ అనుకున్నారా?.. కాంగ్రెస్ కౌంటర్!

ప్రజాపాలన పేరిట.. ప్రజాధనం వృథా అని బీఆర్ఎస్ పార్టీ చేసిన ట్వీట్ కు కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది.

Update: 2024-06-08 15:43 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రజాపాలన పేరిట.. ప్రజాధనం వృథా అని బీఆర్ఎస్ పార్టీ చేసిన ట్వీట్ కు కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. ప్రామాణికంగా లేని ఒక పేపర్ ముక్కని పట్టుకొని అదేదో ప్రభుత్వ ఉత్తర్వుగా పనికిమాలిన ఆరోపణలు చేస్తున్నారని మండిపడింది. మీలా ఉన్నవి కూల్చి కట్టి.. ఖజానాకి బొక్క పెట్టే టైప్ అనుకున్నారా? అని బీఆర్ఎస్ పై ఆరోపణలు చేసింది. పదేండ్లు ప్రభుత్వాన్ని ఏలిన మీకు ఏ కాగితం ప్రామాణికంగా తీసుకోవాలో.. ఏది తీసుకోకూడదో కూడా తెల్వకపాయే!! అని ఎద్దేవా చేసింది. ఏదో రకంగా ప్రభుత్వం పై బురద జల్లడమే పనిగా పెట్టుకున్న పనికిమాలిన వారికి ఎందుకు తెలుస్తది అని, అలాంటి వారికి ఇలాంటి పనికిమాలిన కాగితాలే దొరుకుతాయ్ మరీ!! తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

కాగా పేర్ల మార్పు కోసం రూ.4,639 కోట్లా? అని, పేర్ల మార్పుకై ప్రజాధనాన్ని వృథా చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం అని బీఆర్ఎస్ పార్టీ ట్వీట్ చేసింది. ఇందులో తెలంగాణ తల్లి విగ్రహం మార్పు కోసం రూ.996 కోట్లు, టీఎస్ నుంచి టీజీ గా మార్చడం కోసం రూ.1771 కోట్లు, కార్యాలయాల పేర్ల మార్పు కోసం రూ.461 కోట్లు, ఇనిస్టిట్యూషన్స్ పేర్ల మార్పు కోసం రూ.842 కోట్లు, అడ్వర్టైజ్మెంట్స్ & కమ్యూనికేషన్స్.. పేర్ల మార్పు కోసం రూ.563 కోట్లు, పోలీస్ సెక్యూరిటీస్ పేర్ల మార్పు కోసం రూ.5 కోట్లు ఖర్చు పెడుతుందని ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేసింది.


Similar News