ఆరు రోజుల్లో.. సన్న బియ్యం ఎంత మందికి పంపిణీ చేశారో తెలుసా..?
రాష్ట్రంలో పేదల ఆహార భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేసింది.
దిశ,వెబ్ డెస్క్: రాష్ట్రంలో పేదల ఆహార భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేసింది.దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు సన్నబియ్యం రేషన్ పంపిణీ కొనసాగుతోంది. అయితే గడిచిన ఆరు రోజుల్లో 1.27 కోట్ల మంది లబ్ధిదారులు సన్నబియ్యం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే మొత్తం 90.42 లక్షల రేషన్ కార్డులుండగా.. ఏప్రిల్ లో 42 లక్షల కార్డులపై లబ్ధిదారులు బియ్యం తీసుకున్నారు.
ఈ ఆరు రోజుల్లోనే 8.75 లక్షల క్వింటాళ్ల బియ్యం సరఫరా చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 90.42 లక్షల రేషన్ కార్డులుండగా.. ఇప్పటివరకు ఏప్రిల్ కోటా కింద 42 లక్షల రేషన్ కార్డులపై పేదలు సన్న బియ్యం తీసుకున్నారు. ప్రతి నెల లబ్ధిదారులు సగటున 16 లక్షల క్వింటా ళ్ల బియ్యం రేషన్ షాపుల నుంచి తీసుకుంటుండగా.. ఈ నెలలో ఆరు రోజుల వ్యవధిలో 8.75 లక్షల క్వింటాళ్ల బియ్యాన్ని వినియోగదారులకు పంపిణీ చేశారు.అలాగే రాష్ట్రంలో మొత్తం 17,311 రేషన్ షాపులు ఉండగా.. 8,899 షాపుల్లో సన్నబియ్యం పంపిణీ జరుగుతోంది.పలు చోట్ల రవాణా, సాంకేతిక సమస్యలతో పంపిణీ నెమ్మదిగా సాగుతున్నా.. ఈ నెల 15వరకు పూర్తవుతుందని అధికారులు పేర్కొన్నారు.