ఎమర్జెన్సీ పేరుతో రాజ్యాంగాన్ని హత్య చేసింది కాంగ్రెస్.. కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్ ఎమర్జెన్సీ పేరుతో రాజ్యాంగాన్ని హత్య చేసిందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి (Union Minister Kishan Reddy) మండిపడ్డారు.

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ ఎమర్జెన్సీ పేరుతో రాజ్యాంగాన్ని హత్య చేసిందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి (Union Minister Kishan Reddy) మండిపడ్డారు. భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా. బీఆర్ అంబేద్కర్ జయంతి (Dr, BR Abmedkar birth Anniversary) సందర్భంగా కిషన్ రెడ్డి.. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు (Tributes) అర్పించారు. అనతరం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ (Congress Party)పై ఫైర్ అయ్యారు. రాజ్యాంగం రాసిన అంబేద్కర్ ను కాంగ్రెస్ పార్టీ అడుగడుగునా అవమానించిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
అలాగే కాంగ్రెస్ హయాంలోనే అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాలరాసి ఎమర్జెన్సీ (Emergency) విధించారని గుర్తు చేశారు. ఎమర్జెన్సీ పేరుతో కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్నే హత్య చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు ఆనాడు ప్రజలు ఎదురుతిరిగి కాంగ్రెస్ కు బుద్ది చెప్పారని అన్నారు. బీజేపీ (BJP) అధికారంలోకి వచ్చాక అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళుతుందని, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు (Reservations) పెంచేలా చేసిన ఘనత మోడీ (PM Modi)దేనని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.