పేషెంట్ కాళ్లు పట్టి లాక్కెళ్లిన ఘటనపై డీఎంఈ విచారణ
నిజామాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రిలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ బృందం విచారణ చేపట్టింది.
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రిలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ బృందం విచారణ చేపట్టింది. ఈనెల ఒకటిన ఉదయం 8 గంటలకు ఆసుపత్రిలో బోధన్‌కు చెందినా హన్మాండ్లు అనే పేషెంట్‌ను కాళ్ళు పట్టుకొని లాక్కెళ్లిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ముగ్గురు సభ్యుల బృందం విచారణ చేపట్టింది. ఈనెల 14న ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కాగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ
మంత్రి హరీశ్ రావు ఆదేశాలతో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అధికారులు నిజామాబాద్‌కు వచ్చారు. ఘటన జరిగిన తీరు నిజానిజాలపై దర్యాప్తు చేపట్టారు. ప్రభుత్వ వైద్య కళాశాల అనుబంధ జిల్లా ఆసుపత్రి అధికారులు సిబ్బందికి తెలియకుండా రెండు అంతస్తుల్లో రహస్య విచారణ చేపట్టారు. అనంతరం ఆసుపత్రి అధికారులతో విచారణ చేపట్టారు. సంబంధిత నివేదికను డీఎమ్ఈకి సమర్పిస్తామని విచారణ అధికారులు తెలిపారు. జీజీహెచ్‌లో రోగి నిర్లక్ష్య వైద్యంపై డీఎంఈ విచారణ అంశాన్ని ఆసుపత్రి అధికారులు పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు.