డీజీపీ చర్యలు తీసుకోకపోతే..పరిణామాలు తీవ్రంగా ఉంటాయి : DK Aruna
దిశ, డైనమిక్ బ్యూరో : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌లను అరెస్ట్ చేయడంపై బీజేపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌లను అరెస్ట్ చేయడంపై బీజేపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, బీజేపీ నేతల అరెస్ట్‌లను తీవ్రంగా ఖండించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ శాంతియుతంగా నిరాహార దీక్ష చేస్తుంటే, అక్రమంగా అరెస్టు చేయడం రాజ్యాంగ విరుద్ధం అన్నారు. కేసీఆర్ తన కూతురిపై వచ్చిన ఆరోపణలను చట్టబద్ధంగా తప్పని నిరూపించుకోవాలి.
కానీ, బీజేపీ కార్యకర్తలపై కేసులు పెట్టి హింసించడం న్యాయబద్ధం కాదు. ముందస్తు అనుమతితో పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ నిరాహార దీక్ష చేస్తుంటే అత్యంత కఠినంగా వ్యవహరిస్తూ అరెస్టు చేయడం పోలీసు వ్యవస్థ నిజాయితీని ప్రశ్నార్ధకం చేస్తుందని మండిపడ్డారు. గత కొన్ని రోజులుగా పోలీసు వ్యవస్థ బీజేపీ కార్యకర్తలు, నాయకుల పట్ల వ్యవహరిస్తున్న తీరు చాలా బాధాకరం అన్నారు. అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తూ ప్రతిపక్ష పార్టీల గొంతులను నొక్కేయాలనుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం అంటూ అరుణ ఫైర్ అయ్యారు. ఇప్పటికైనా డీజీపీ పోలీసులు వ్యవహరిస్తున్న తీరు పట్ల సరైన సమీక్ష నిర్వహించి చర్యలు తీసుకోకపోతే జరిగే పరిణామాలకు పోలీసులే బాధ్యత వహించవలసి ఉంటుందన్నారు.