DK Aruna: రేవంత్.. కేసీఆర్‌ను మించిపోయాడు

ప్రజావ్యతిరేక పాలనలో మాజీ సీఎం కేసీఆర్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) మించిపోయారని ఎంపీ డీకే అరుణ(DK Aruna) విమర్శలు చేశారు.

Update: 2024-09-16 14:22 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజావ్యతిరేక పాలనలో మాజీ సీఎం కేసీఆర్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) మించిపోయారని ఎంపీ డీకే అరుణ(DK Aruna) విమర్శలు చేశారు. కేసీఆర్(KCR) నియంతలా వ్యవహరిస్తే ప్రజలు దించేశారని, ఇప్పుడు అదేబాటలో రేవంత్ వెళ్తున్నారని, ఆయనకు కూడా కేసీఆర్‌కు పట్టిన గతే పడుతుందని అన్నారు. హైదరాబాద్‌లో పలు గణపతి మండపాలను దర్శించుకున్న అనంతరం ఆమె మహబూబ్ నగర్ బయలుదేరారు. ఈ క్రమంలో ఆమె సోమవారం మీడియాతో మాట్లాడారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేక, ప్రజాపాలన పేరుతో రేవంత్ డ్రామాలు చేస్తున్నారని ఫైరయ్యారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిరహించే దమ్ము ఈ ప్రభుత్వానికి లేదని ఆమె విరుచుకుపడ్డారు.

ముస్లింల ఓటు బ్యాంకు కాపాడుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తోందని ఆమె మండిపడ్డారు. ప్రజలను మోసం చేయడం, అబద్ధాలు చెప్పడంలో కాంగ్రెస్ దిట్ట అని డీకే అరుణ చురకలంటించారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని గతంలో బీఆర్ఎస్ మోసం చేసిందని ఆమె గుర్తుచేశారు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా మోసం చేస్తోందన్నారు. యూట్యూబ్ ఛానళ్లే లేకుంటే.. రేవంత్ రెడ్డి సీఎం అయ్యేవాడే కాదని డీకే అరుణ ఎద్దేవా చేశారు. యూట్యూబ్ జర్నలిస్టులను వాడుకున్నంత వాడుకుని అవసరం తీరాక ఇప్పుడు తక్కువ చేసి మాట్లాడటం సిగ్గుచేటని ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు.


Similar News