DS మృతిపై ప్రగాఢ సంతాపం తెలిపిన డీకే అరుణ, కిషన్ రెడ్డి

సీనియర్ రాజకీయ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ మృతిపట్ల కేంద్రమంత్రి కిషన్, ఎంపీ డీకే అరుణ సంతాపం తెలియజేశారు.

Update: 2024-06-29 03:47 GMT

దిశ, వెబ్‌డెస్క్: సీనియర్ రాజకీయ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ మృతిపట్ల కేంద్రమంత్రి కిషన్, ఎంపీ డీకే అరుణ సంతాపం తెలియజేశారు. ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ప్రజాసేవకు అంకితమయ్యారన్నారు. 2004-2009లో అసెంబ్లీలో వారందించిన ప్రోత్సాహం మరువలేనిదని గుర్తుచేసుకున్నారు. మంత్రిగా, పీసీసీ చీఫ్‌గా, ఎంపీగా DS చేసిన సేవలు మరువలేనివని పేర్కొన్నారు. DS పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడ్ని ఆకాంక్షిస్తున్నామని వెల్లడించారు. DS తనయుడు ప్రస్తుత నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, వారి కుటుంబ సభ్యులను ఫోన్లో పరామర్శించి  శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ఆంధ్రప్రదేశ్‌కు కాంగ్రెస్ అధ్యక్షుడిగా, వైఎస్ క్యాబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన  శ్రీనివాస్ 1989 కాంగ్రెస్‌లో చేరి నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేసి మొదటిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. తర్వాత 2004, 2009 లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. తెలంగాణ విభజన తర్వాత డీఎస్ బీఆర్ఎస్‌ పార్టీలో చేరారు. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యాక బీఆర్‌ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. ఇక గత కొంతకాలంగా అనారోగ్యంతో మంచానికే పరిమితమైన శ్రీనివాస్ నేడు తెల్లవారుజామున 3 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు.  

Tags:    

Similar News