కాంగ్రెస్‌లో పని విభజన.. జిల్లాల వారీగా స్పోక్స్​పర్సన్స్

కాంగ్రెస్ పార్టీలో జిల్లాల వారీగా స్పోక్స్​పర్సన్స్​ను నియమిస్తున్నట్లు టీపీసీసీ వైస్​ప్రెసిడెంట్​ చామల కిరణ్​ కుమార్​ రెడ్డి పేర్కొన్నారు.

Update: 2023-06-23 16:32 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీలో జిల్లాల వారీగా స్పోక్స్​పర్సన్స్​ను నియమిస్తున్నట్లు టీపీసీసీ వైస్​ప్రెసిడెంట్​ చామల కిరణ్​ కుమార్​ రెడ్డి పేర్కొన్నారు. గాంధీభవన్​లో శుక్రవారం జరిగిన టీపీసీసీ అధికార ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందన్నారు. అందరూ సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉన్నదన్నారు. నిశిత పరిజ్ఞానం,లోతైన అవగాహన ఉంటేనే విజయం సాధిస్తామన్నారు.ప్రతి రోజు గాంధీ భవన్ లో అధికార ప్రతినిధులు హాజరయ్యేలా పని విభజన చేస్తున్నామన్నారు. జిల్లాల వారీగా అధికార ప్రతినిధులకు బాధ్యతలు ఇవ్వడం వలన కాంగ్రెస్​ పార్టీ యాక్టివిటీస్​మరింత స్పీడ్​ అవుతాయన్నారు.

రోజు వారీ అంశాలపై అధికార ప్రతినిధులు తక్షణమే స్పందించేలా చర్యలు తీసుకున్నామన్నారు. కీలక అంశాలలో పార్టీ విధానం తెలుసుకున్నాకే స్పందించాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల సమయంలో అత్యంత జాగ్రత్తగా చురుకుగా వ్యవహరించాలన్నారు. బీజేపీ, బీఆర్​ఎస్​ ప్రజా వ్యతిరేక విధానాలపై ఫోకస్​ పెంచాల్సిన అవసరం ఉన్నదన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి మన్సూర్ అలీ ఖాన్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి తదితరులు పాల్గొన్నారు.


Similar News