TGSRTC: గుడ్ న్యూస్.. జేబులో డబ్బులు లేకున్నా RTC బస్సుల్లో జాలీగా ప్రయాణం

తెలంగాణ ప్రయాణికులకు ఆర్టీసీ సంస్థ శుభవార్త చెప్పింది. దశాబ్దాలు అటు ఉద్యోగులు, ఇటు ప్రయాణికులు పడుతున్న ఇబ్బందికి త్వరలో చెక్ పెట్టబోతుంది.

Update: 2024-06-26 11:36 GMT

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ ప్రయాణికులకు ఆర్టీసీ సంస్థ శుభవార్త చెప్పింది. దశాబ్దాలుగా అటు ఉద్యోగులు, ఇటు ప్రయాణికులు పడుతున్న ఇబ్బందికి త్వరలో చెక్ పెట్టబోతుంది. ఆర్టీసీ ప్రయాణికులకు ఇప్పటి వరకు చిల్లర సమస్య ఉండే.. కానీ ఇకపై ఆ సమస్యకు చెల్లుచీటి పడునుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు జీరో టికెట్ అమలవుతోంది. దీంతో మహిళా ప్యాసింజర్స్ తాకిడి ఎక్కువైంది. మరోవైపు కండక్టర్లు వారికి టికెట్స్ తీసుకోకపోవడంతో నగదు కొరత ఏర్పడుతుంది. ఈ క్రమంలో పురుష ప్రయాణికులు, ఇతర రాష్ట్రాల వాళ్లు టికెట్ తీసుకున్న సమయంలో టికెట్‌కు సరిపడ చిల్లర లేక కండక్టర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే విషయంపై గతంలో బస్సుల్లో ఘర్షణలు జరిగిన సంఘటనలు ఉన్నాయి. అయితే ఈ సమస్యలన్నీటికి చెక్ పెట్టేందుకు టీజీఎస్‌ఆర్టీసీ సిద్ధమైంది.

ఇకపై ఆర్టీసీ బస్సుల్లోనూ యూపీఐ సర్వీసులను ప్రారంభించడానికి సన్నద్ధం అయింది. టికెట్‌కు సరిపోను డబ్బులు ఆన్ లైన్‌లో పేమెంట్ తీసుకునే ఏర్పాట్లు చేస్తున్నారు. ఫోన్ పే, గూగుల్ పే, డెబిట్‌, క్రెడిట్‌ కార్డు స్వైపింగ్‌ లాంటి డిజిటల్ పేమెంట్స్ సౌకర్యాలను టీజీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో కల్పించనున్నారు. ఇప్పటికే హైదరాబాద్ నగరంలోని బండ్లగూడ డిపో పరిధిలోని 70 బస్సుల్లో పైలెట్ ప్రాజెక్ట్ కింద ఈ టికెట్ జారీ యంత్రాలను అందజేసి అమలు తీరును పరిశీలిస్తున్నారు. గత 20 రోజులుగా కండక్టర్లు ఈ ప్రాజెక్టును అమలు చేస్తున్నారు. డిజిటల్ చెల్లింపుల ద్వారా టికెట్ల జారీ ప్రక్రియ విషయంలో సాధ్యాసాధ్యాలు, యంత్రాల పనితీరు, క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడంలో లోపాలు లాంటి సమస్యలపై ఆర్టీసీ స్టడీ చేస్తోంది. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకపోవడంతో తదుపరి ప్లాన్ సిద్ధం చేసి.. నగరవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపుల ప్రక్రియను ప్రారంభించేందుకు టీజీఎస్‌ఆర్టీసీ సన్నద్ధం అవుతుంది. పూర్తి స్టడీ అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ చెల్లింపులు ప్రక్రియ ప్రారంభించనున్నారు ఆర్టీసీ అధికారులు. 


Similar News