జీహెచ్ఎంసీ ముందు మహిళా స్వీపర్ల ధర్నా

సీఎం కేసీఆర్ తమకు ఇచ్చిన మాట నిలబెట్టుకుని వెంటనే తమను పర్మినెంట్ చేయాలని అవుట్ సోర్స్ శానిటేషన్ మహిళా స్వీపర్లు బైఠాయించారు.

Update: 2023-08-19 10:35 GMT

దిశ, సిటీ బ్యూరో : సీఎం కేసీఆర్ తమకు ఇచ్చిన మాట నిలబెట్టుకుని వెంటనే తమను పర్మినెంట్ చేయాలని అవుట్ సోర్స్ శానిటేషన్ మహిళా స్వీపర్లు శనివారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు బైఠాయించారు. ఒక్కసారిగా వేలాదిమంది మహిళా స్వీపర్లు తరలిరావడంతో పోలీసులు భారీగా మోహరించారు. ఉద్రిక్త పరిస్థితుల నడుమ మహిళా స్వీపర్ల బయటయింపు కొనసాగుతుంది. కాసేపట్లో స్వీపర్లను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు.

Tags:    

Similar News