ముగిసిన ధరణి కమిటీ భేటీ.. సమస్యల పరిష్కారానికి కీలక నిర్ణయం..!
ధరణి కమిటీ భేటీ ముగిసింది. ధరణి పోర్టల్‌లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో వచ్చిన అప్లికేషన్లపై కమిటీ
దిశ, వెబ్‌డెస్క్: ధరణి కమిటీ భేటీ ముగిసింది. ధరణి పోర్టల్‌లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో వచ్చిన అప్లికేషన్లపై సమీక్షించేందుకు కమిటీ ఇవాళ సచివాలయంలో భేటీ అయ్యింది. రాష్ట్రంలో నెలకొన్న భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి కీలక సూచనలు ప్రతిపాదించింది. జూన్ 4వ తేదీలోగా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న లక్ష ఫిర్యాదులను పరిష్కరించాలని నిర్ణయించింది. ఇప్పటికే లక్షన్నర కంప్లైంట్‌లను పరిష్కరించినట్లు పేర్కొంది. కాగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌లో సమస్యలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. దీంతో ఇటీవల రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి సమస్యల పరిష్కారంపై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా ధరణి పోర్టల్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది.