విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణపై డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
రాష్ట్రంలోని విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క క్లారిటీ ఇచ్చారు. విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరించాలనే ఆలోచన తమ
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క క్లారిటీ ఇచ్చారు. విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరించాలనే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. కాగా, కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. డిస్కంలను ప్రైవేటీకరణ చెయొద్దని.. దీనిపై సీఎం రేవంత్ అధికారికంగా ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. డిస్కమ్‌లలో ఏం జరుగుతుందో ఆ శాఖ మంత్రి భట్టి విక్రమార్క తెలుసుకోవాలి. కరెంట్ బిల్లు కలెక్షన్లకు వెళ్తే అదానీ మనుషులు వచ్చారని గొడవలు అయ్యోయో లేదో తెలుసుకోవాలని సూచించారు.
అదానీ మనుషులు వచ్చారంటూ పాతబస్తీలో గొడవలు జరిగాయని ఇంటలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చిందో లేదో తెలుసుకోవాలన్నారు. పాత బస్తీ ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టి వారి భయాలు తొలగించడని కోరారు. ఈ క్రమంలో కేటీఆర్ కామెంట్స్‌కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్‌లో పవర్ సర్కిళ్లను ప్రైవేటువాళ్లకు ఇస్తున్నట్లు ఎక్కడా చెప్పలేదు. ఎవరో పత్రికల్లో రాసినదాన్ని పట్టుకుని సభలో మాట్లాడితే ఎలా అని కేటీఆర్‌ను ప్రశ్నించారు. బీఆర్ఎస్ వాళ్లలా ఏది పడితే అది చేసే వాళ్లం కాదని అన్నారు. కేటీఆర్ సభతో పాటు రాష్ట్రాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని భట్టి ఫైర్ అయ్యారు.