ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు BJP సిగ్గుపడాలి.. డిప్యూటీ సీఎం భట్టి ఫైర్

కాంగ్రెస్(Congress) మహిళా నాయకురాలు, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ(Priyanka Gandhi)పై బీజేపీ నేత చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) స్పందించారు.

Update: 2025-01-07 12:42 GMT

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్(Congress) మహిళా నాయకురాలు, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ(Priyanka Gandhi)పై బీజేపీ నేత చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) స్పందించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రియాంక గాంధీ మీద బీజేపీ నేత అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమని అన్నారు. బీజేపీ నాయకత్వం ఈ దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇటువంటి వ్యాఖ్యలు చేసినందుకు బీజేపీ సిగ్గుపడాలని సీరియస్ అయ్యారు. భారతీయ సంస్కృతిపై బీజేపీ నేతల దాడిగా గుర్తించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు.

కాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేత రమేష్ బిధూరీ వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రాను ఉద్దేశిస్తూ ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు. కల్కాజీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న ఆయన.. తాను గెలిస్తే స్థానిక రోడ్లను ప్రియాంక గాంధీ వాద్రా బుగ్గల్లా మారుస్తానంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో ఫైరవుతున్నారు. దేశవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చారు.

Tags:    

Similar News