పిచ్చోని చేతిలో పార్టీ ఉంటే ప్రజాస్వామ్యానికే ప్రమాదం..! : KTR
మంగళవారం అర్థరాత్రి బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్‌ను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
దిశ, డైనమిక్ బ్యూరో : పదవతరగతి హిందీ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో భాగంగా మంగళవారం అర్థరాత్రి బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్‌ను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయమై మంత్రి కేటీఆర్ బుధవారం ట్విట్టర్ వేదికగా స్పందించారు. బీఆర్ఎస్ అధికార ట్విట్టర్ అకౌంట్ చేసిన ఓ ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ...‘పిచ్చోని చేతిలో రాయి ఉంటే..వచ్చి పోయేటోళ్ళకే ప్రమాదం. కానీ, అదే పిచ్చోని చేతిలో ఒక పార్టీ ఉంటే..ప్రజాస్వామ్యానికే ప్రమాదం..!’అంటూ తీవ్ర విమర్శలు చేశారు.
తమ స్వార్థ రాజకీయాల కోసం ప్రశ్నాపత్రాలు లీకు చేసి అమాయకులైన విద్యార్ధుల, నిరుద్యోగుల జీవితాలతో బీజేపి నాయకులు చెలగాటం ఆడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. మరో ట్వీట్లో పేపర్ లీకుల వెనుక బీజేపీ నేతల హస్తం ఉందని చెప్పడానికి ఇది మరో నిదర్శనం అంటూ పేపర్ లీక్ చేసిన నిందితుడు, బీజేపీ నేతలతో సన్నిహితంగా ఉన్న ఫోటోలను షేర్ చేశారు. కాగా, ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బండి సంజయ్ అరెస్టుతో పార్టీ నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలువురు నేతలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని హౌస్ అరెస్ట్ చేశారు.