రాహుల్ గాంధీ గడ్డం ట్రిమ్ చేసుకున్న కుర్చీ కోసం డిమాండ్ (వీడియో)
రాహుల్ గాంధీ గడ్డం ట్రిమ్ చేసుకున్న కుర్చీకి డిమాండ్ పెరింగింది.
దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇటీవల యూపీలోని రాయ్ బరేలిలో స్థానిక బార్బర్ షాప్ ను సందర్శించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అక్కడ ఆయన తన గడ్డం ట్రిమ్ చేయించుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో రాహుల్ గాంధీ సింప్లిసిటీపై జోరుగా చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే రాహుల్ గాంధీ వచ్చి వెళ్ళాక ఈ షాప్ నిర్వహకులు కు కొత్త తలనొప్పి వచ్చి చేరింది. రాహుల్ రాకతో ఆ షాప్ కు కస్టమర్లు క్యూ కట్టడమే కాకుండా రాహుల్ గాంధీ కుర్చున్న సీటుకు డిమాండ్ కూడా పెరిగింది. వచ్చిన కస్టమర్లంతారాహుల్ గాంధీ కూర్చున్న చైర్ లోనే తమకు కటింగ్ లేదా ట్రిమ్మింగ్ చేయాలంటూ పట్టుబడుతున్నారట. పక్క సీటులో ఖాళీగా ఉందని చెప్పినా తాము రాహుల్ గాంధీ ఉపయోగించిన చైర్ లోనే కూర్చుంటామని వెయిట్ చేస్తున్నారట. రాహుల్ గాంధీ అంతటి వ్యక్తి కూర్చున్న కుర్చీలో తాము కూడా కూర్చోవడానికి అనేక మంది ఇష్టపడుతున్నారట. ఇక్కడ ఉన్న డిమాండ్ ను చూస్తుంటే ఈ కుర్చీ ఎక్కడ దొంగతనం అవుతుందో అనే సందేహాలను వ్యక్తం అవుతున్నాయని షాప్ కు వచ్చిన కష్టమర్లు ఫన్నీగా చెబుతున్నారు.