TGSRTC : రక్షాబంధన్ రోజు ఆర్టీసీ బస్సులో గర్భిణీకి పురుడు పోసిన కండక్టర్.. సజ్జనార్ ఆసక్తికర ట్వీట్

రాఖీ పండుగ నాడు టీజీఎస్ ఆర్టీసీ బస్సులో గర్భిణికి డెలివరీ చేసి ఒక మహిళా కండక్టర్‌ మానవత్వం చాటుకున్నారు.

Update: 2024-08-19 05:49 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: రాఖీ పండుగ నాడు టీజీఎస్ ఆర్టీసీ బస్సులో గర్భిణికి డెలివరీ చేసి ఒక మహిళా కండక్టర్‌ మానవత్వం చాటుకున్నారు. తాను విధులు నిర్వర్తిస్తోన్న బస్సులో గర్భిణికి పురిటి నొప్పులు రాగా, ఆమె వెంటనే స్పందించి బస్సులో ప్రయాణిస్తోన్న నర్సుతో కలిసి ప్రసవం చేశారు. అనంతరం తల్లీబిడ్డను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలోనే టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఎక్స్ వేదికగా వివరాలు వెల్లడించారు. గద్వాల డిపోనకు చెందిన గద్వాల-వనపర్తి రూట్‌ పల్లె వెలుగు బస్సులో సోమవారం ఉదయం సంధ్య అనే గర్భిణి రక్షాబంధనన్‌ సందర్భంగా తన సోదరులకు రాఖీ కట్టేందుకు వనపర్తికి వెళ్తున్నారని, బస్సు నాచహల్లి సమీపంలోకి రాగానే గర్భిణికి ఒక్కసారిగా పురిటినొప్పులు వచ్చాయన్నారు.

వెంటనే అప్రమత్తమైన మహిళా కండక్టర్‌ జి.భారతి బస్సును ఆపించారని తెలిపారు. అదే బస్సులో ప్రయాణిస్తోన్న ఒక నర్సు సాయంతో గర్భిణికి పురుడు పోశారని, పండంటి ఆడ‌బిడ్డ‌కు మ‌హిళ జ‌న్మ‌నిచ్చారని వెల్లడించారు. అనంతరం 108 సాయంతో తల్లీబిడ్డను స్థానిక ఆస్పత్రికి తరలించారని, ప్ర‌స్తుతం త‌ల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారని స్పష్టంచేశారు.

రక్షాబంధన్‌ నాడు బస్సులో గర్భిణికి పురుడు పోసిన కండక్టర్‌ భారతికి టీఎస్ఆర్టీసీ యాజమాన్యం తరపున అభినందనలు తెలిపారు. తాను సమయస్పూర్తితో వ్యవహరించి నర్సు సాయంతో సకాలంలో పురుడు పోయడం వల్లే తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారన్నారు. ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చుతూనే.. సామాజిక బాధ్యతగా సేవ స్ఫూర్తిని ఆర్టీసీ ఉద్యోగులు చాటుతుండటం గొప్ప విషయమని కండక్టర్, తల్లీబిడ్డల ఫోటోను సజ్జనార్ పోస్ట్ చేశారు.

Tags:    

Similar News