ఢిల్లీ లిక్కర్ కేసు: CBI విచారణకు వెళ్లొద్దని కవిత నిర్ణయం?

ఢిల్లీ లిక్కర్ కుంభకోణం వ్యవహారంలో బీఆర్ఎస్ మహిళా నేత, ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో కవితను సీబీఐ నిందితురాలిగా చేర్చింది.

Update: 2024-02-23 13:05 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ కుంభకోణం వ్యవహారంలో బీఆర్ఎస్ మహిళా నేత, ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో కవితను సీబీఐ నిందితురాలిగా చేర్చింది. ఈనెల 26న ఢిల్లీలోని సీబీఐ కార్యాలయంలో జరిగే విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే 41ఏ కింద శుక్రవారం సమన్లు జారీ చేసింది. వాస్తవానికి 26న విచారణకు రావాలని సీబీఐ ఇంతకు ముందే నోటీసులు ఇచ్చింది. అయితే గత నోటీసుల్లో ఆమెను సాక్షిగా పేర్కొన్న సీబీఐ.. ప్రస్తుతం దానిని సవరిస్తూ నిందితురాలిగా పేర్కొంది. పార్లమెంట్ ఎన్నికల వేళ ఈ పరిణామం బీఆర్ఎస్ నేతలను కలవరపాటుకు గురి చేస్తోంది.

తాజాగా.. ఈ నోటీసులపై కవిత ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈడీ కేసులో ఈ నెల 28వ తేదీన సుప్రీంకోర్టులో విచారణ ఉండటంతో సీబీఐ విచారణకు హాజరు కావొద్దని ఫిక్స్ అయినట్లు ఆమె సన్నిహితుల ద్వారా తెలిసింది. తండ్రి, గులాబీ బాస్ కేసీఆర్ ఆదేశాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే.. సుమారుడు ఏడాదిన్నరగా సాగుతున్న ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు దర్యాప్తులో భాగంగా.. చాలా మందిని సీబీఐ, ఈడీ విచారిస్తూ వస్తున్నాయి. ఇప్పటికే కీలక నిందితులు అప్రూవర్లుగా మారిపోయారు. ఈ క్రమంలోనే.. నిందితులు ఇచ్చిన స్టేట్ మెంట్ల ఆధారంగా.. కవితకు సీబీఐ అధికారులు నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News