బాబ్రీ విధ్వంసం ఎన్నటికీ మరువం మరువనివ్వం! AIMIM చీఫ్ ఒవైసీ ట్వీట్

భారత ప్రజాస్వామ్యానికి డిసెంబర్ 6 ఎప్పటికీ బ్లాక్ డేగా మిగిలిపోతుందని హైదరాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.

Update: 2022-12-06 10:23 GMT

దిశ,డైనమిక్ బ్యూరో: భారత ప్రజాస్వామ్యానికి డిసెంబర్ 6 ఎప్పటికీ బ్లాక్ డేగా మిగిలిపోతుందని హైదరాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. అయోధ్యలోని బాబ్రీ మసీదు కూల్చివేసి 30 ఏళ్లు అయిన సందర్భంగా మంగళవారం ట్వీట్ చేసిన ఆయన.. బాబ్రీ మసీదును అపవిత్రం చేయడం, కూల్చివేయడం అన్యాయానికి ప్రతీక అన్నారు. బాబ్రీ మసీదు విధ్వంసానికి బాధ్యులైన వారు ఎన్నడూ శిక్షించబడలేదని, దానిని మేము ఎన్నటికీ మరిచిపోలేమన్నారు. అలాగే ఈ విధ్వంసం భవిష్యత్తు తరాలు కూడా గుర్తుంచుకునేలా చూస్తామన్నారు. కాగా బాబ్రీ మసీదు కూల్చివేతకు నిరసనగా హైదరాబాద్‌లో ముస్లిం మహిళలు నల్లజెండాలు ఎగురవేసి నిరసన తెలిపారు. సైదాబాద్‌లో ముస్లిం మహిళలు నల్లజెండాలతో నిరసన వ్యక్తం చేశారు. 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదు ధ్వంసం జరిగింది.


Tags:    

Similar News