ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య మరణం.. భర్త చేసిన పనికి షాక్ తిన్న బంధువులు

ప్రాణంగా ప్రేమించి, ఆపై పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు.

Update: 2024-08-30 14:01 GMT

దిశ, సత్తుపల్లి : ప్రాణంగా ప్రేమించి, ఆపై పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. అంతా సవ్యంగా సాగుతుంది అనుకుంటున్న సమయంలో భార్య తీవ్ర అనారోగ్యానికి గురై చికిత్స పొందుతూ మృతి చెందింది. భార్యను వదలలేక ఆమె చేతిని హ్యాండ్ కాస్టింగ్ చేసుకొని, భార్య గుర్తును పదిల పరుచుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం ఎడ్ల బంజరకు చెందిన అశోక్ కన్న, పద్మశ్రీ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కూతురు పుట్టింది. ఇక జీవితం సంతోషమయం అనుకుంటున్న సమయంలో పద్మ తీవ్ర అనారోగ్యం పాలైంది. విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. భార్య మరణాన్ని తట్టుకోలేని అశోక్, ఆమె గుర్తుగా ఏదైనా దాచుకోవాలని అనుకున్నాడు. ప్రత్యేక కాస్టింగ్ నిపుణులను పిలిపించి.. తన చేయి, తన భార్య చేయి, కూతురు చేయి.. ముగ్గురిది కలిపి హ్యాండ్ కాస్టింగ్ చేయించి భద్రపరుచుకున్నాడు. పద్మ అంతిమయాత్రకు చేరుకున్న బంధువులు, ఊరి ప్రజలు భార్యపై అశోక్ ప్రేమను చూసి కంటతడి పెట్టారు.      


Similar News