రేవంత్ అన్నం తింటున్నాడా? గడ్డి తింటున్నాడా?

అధికారం ఎవరికీ శాశ్వతం కాదని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ అన్నారు. శనివారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికార అహంకారాన్ని సీఎం రేవంత్ రెడ్డి నరనరాల్లో ఎక్కించుకున్నారని సీరియస్ కామెంట్స్ చేశారు.

Update: 2024-01-27 11:23 GMT

దిశ, బెబ్‌డెస్క్: అధికారం ఎవరికీ శాశ్వతం కాదని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ అన్నారు. శనివారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికార అహంకారాన్ని సీఎం రేవంత్ రెడ్డి నరనరాల్లో ఎక్కించుకున్నారని సీరియస్ కామెంట్స్ చేశారు. కేసీఆర్‌ను తెలంగాణ తెచ్చిన మనిషి అని కూడా చూడకుండా ఆయన వయసుకు గౌరవం ఇవ్వకుండా రేవంత్ రెడ్డి అసభ్యంగా మాట్లాడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. గల్లీ లీడర్ కన్నా అధ్వాన్నంగా, చిల్లరగా రేవంత్ తీరు ఉందని మండిపడ్డారు. రేవంత్ గడ్డి తింటున్నాడా? అన్నం తింటున్నాడా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాజకీయాలకు పట్టిన శని రేవంత్ అని వ్యాఖ్యానించారు.

రేవంత్ రెడ్డి తీరు మార్చడం రాహుల్ గాంధీ వల్లే అవుతుందని.. వెంటనే రేవంత్‌పై దృష్టి పెట్టాలని హితవు పలికారు. బిల్లా రంగాలకు ప్రతి రూపం రేవంత్ రెడ్డే అని అభిప్రాయపడ్డారు. గల్లీ పహిల్వాన్ భాషను రేవంత్ మార్చుకోవాలని హితవు పలికారు. అద్దం ముందు కూర్చుని రేవంత్ ఓ సారి మొహం చూసుకోవాలని సూచించారు. సంస్కారం సభ్యత నేర్చుకో అని హెచ్చరించారు. ఐదేళ్ల తర్వాత కాంగ్రెస్‌ సీఎంగా ఎవరుంటారో తెలియదు అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌‌కు అధికారం ఉన్న ఏ రాష్ట్రంలో కూడా ఐదేళ్ల తర్వాత పాత సీఎం కొనసాగలేదని గుర్తుచేశారు.

తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌కు గోరీ కడతావా? అని మండిపడ్డారు. కేసీఆర్ మీద భాష ఇలాగే కొనసాగితే రేవంత్ నాలుక చీరేసే బాధ్యత తెలంగాణ ప్రజలు తీసుకుంటారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేస్తే అంత ఉలుకుబాటు ఎందుకని ప్రశ్నించారు. కేసీఆర్ కన్నా మంచి పాలన అందించడంలో రేవంత్ పోటీ పడాలని సూచించారు. రేవంత్‌కు చేతనైతే కృష్ణ రివర్ బోర్డు విషయంలో కేంద్రం మెడలు వంచేందుకు కృషి చేయాలని అన్నారు.

Tags:    

Similar News