Danam Nagender: కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలు వ్యక్తిగతమా.. పార్టీ స్టాండా!.. ఎమ్మెల్యే దానం నాగేందర్ ఫైర్

ఎమ్మెల్యే అరెకపూడి గాంధీపై కౌశిక్‌రెడ్డి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఫైర్ అయ్యారు.

Update: 2024-09-13 06:13 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఎమ్మెల్యే అరెకపూడి గాంధీపై కౌశిక్‌రెడ్డి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఫైర్ అయ్యారు. కవాలనే ఆంధ్రా, తెలంగాణ అంటూ ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ధ్వజమెత్తారు. ఆయన వ్యాఖ్యలు వ్యక్తిగతమా.. లేక పార్టీ స్టాండా..? అని ప్రశ్నించారు. ఒకవేళ వ్యక్తిగతమే అయితే బీఆర్ఎస్ పార్టీని నుంచి ఆ ఎమ్మెల్యేను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశానికి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ఇళ్లే దొరికిందా.. అని కామెంట్ చేశారు. కౌశిక్‌రెడ్డిని బీఆర్ఎస్‌లో ఉన్న అగ్రనేతలే రెచ్చగొడుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీనియర్ శాసన సభ్యుడైన హరీశ్‌రావు కూడా ఇలాంటి సంస్కృతిని ప్రోత్సహించొద్దని హితవు పలికారు. చీర, గాజులు అంటూ కామెంట్ చేసిన కౌశిక్‌రెడ్డికి త్వరలోనే మహిళల శక్తి ఏంటో చూపిస్తామని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు.     


Similar News