మంత్రి సీతక్క హామీతో విధుల్లో చేరిన సీఆర్టీ ఉపాధ్యాయులు
గిరిజన ఆశ్రమ పాఠశాలలో కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు 2012 నుంచి పనిచేస్తున్నారని, కానీ గత ప్రభుత్వాలు వారి సమస్యలు పట్టించుకోలేదని, గిరిజన కాంట్రాక్టు ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు అజ్మీరా శివనాయక్ అన్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: గిరిజన ఆశ్రమ పాఠశాలలో కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు 2012 నుంచి పనిచేస్తున్నారని, కానీ గత ప్రభుత్వాలు వారి సమస్యలు పట్టించుకోలేదని, గిరిజన కాంట్రాక్టు ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు అజ్మీరా శివనాయక్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...డిసెంబర్ 16 నుంచి జనవరి 3 వరకు సమ్మె చేశామని, మంత్రి సీతక్క మా సమస్యలపై చర్చించి మా డిమాండ్లను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారన్నారు. మంత్రి సీతక్క హామీతో రాష్ట్ర వ్యాప్తంగా 2,102 మంది సీఆర్టీలు విధుల్లో చేరారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, పంచాయతీరాజ్, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఎ. శరత్, గిరిజన సంక్షేమ శాఖ అడిషనల్ డైరెక్టర్ సర్వేశ్ రెడ్డి కి మా సంఘం తరపున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆదివాసి, గిరిజన బిడ్డలకు న్యాయం జరగలేదని, ఇందిరమ్మ రాజ్యంలో ఆదివాసి గిరిజన ఉపాధ్యాయులను పిలిపించుకుని మా సమస్యలను పరిష్కరించేందుకు ఎంతగానో కృషి చేసిన మంత్రి సీతక్క కు, ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసినా సరిపోదన్నారు.
రేపు జిల్లా పంచాయతీ అధికారులతో మంత్రి సీతక్క సమీక్షా సమావేశం
రేపు జిల్లా పంచాయతీ అధికారులతో మంత్రి సీతక్క సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఎర్రమంజిల్ లోని రూరల్ ఇంజనీరింగ్ శాఖ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఈ సమావేశాన్ని నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. గ్రామాల్లో అభివృద్ధి పనులు, నిధుల నిర్వహణ, పారిశుధ్యం, తాగునీటి క్లోరినేషన్, పచ్చదనం పెంపకం తదితర అంశాలపై చర్చించనున్నట్టు పేర్కొన్నారు.