పులిచింతల ప్రాజెక్టు డ్యాంపై మొసలి సంచారం

కృష్ణానది పులిచింతల ప్రాజెక్టు రిజర్వాయర్ డ్యాంపై మొసలి సంచారం కలకలం రేపిం

Update: 2024-10-02 06:15 GMT

దిశ, వెబ్ డెస్క్ : కృష్ణానది పులిచింతల ప్రాజెక్టు రిజర్వాయర్ డ్యాంపై మొసలి సంచారం కలకలం రేపింది. ఇటీవల కురిసిన వర్షాలకు తోడుగా ఎగువన నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి భారీగా వరద నీటి రాకతో పులిచింతల ప్రాజెక్టు రిజర్వాయర్ పూర్తి స్ధాయి నీటీ మట్టానికి చేరుకుంది. అలా వచ్చిన వరద నీటీతో పాటు రిజర్వాయర్ లోకి భారీ సంఖ్యలో మొసళ్ళు కూడా వచ్చి చేరాయి. తరచు రిజర్వాయర్ లోని మొసళ్ళు, వాటి పిల్లలు సమీప పంట చేనుల్లోకి, రోడ్లపైకి వస్తుంటాయి. అయితే ఓ భారీ మొసలి మాత్రం ఏకంగా డ్యాం రోడ్దుపైకి చేరుకుంది. ఈ మార్గంలో తెల్లవారుజామున రాకపోకలు సాగిస్తున్న ప్రయాణికులు, రైతులు రోడ్దు మీదుగా వెలుతున్న ఆ మొసలిని చూసి భయభ్రాంతులకు లోనయ్యారు. కొందరు డ్యాం రోడ్దుపై తాపీగా సంచరిస్తున్న మొసలిని తమ సెల్ ఫోన్లలో చిత్రీకరించడంతో ఆ మొసలి వీడియోలు సామాజిక మాద్యమాల్లో వైరల్ గా మారాయి.

మొసళ్ళ సంచారం పట్ల అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. గతంలో ఒక ముసలి నీటిని వదిలి రోడ్డుపై సంచరిస్తున్న సమయంలో అటుగా వచ్చిన భారీ వాహనం మీదుగా వెళ్ళడంతో అక్కడికక్కడే చనిపోయింది. 


Similar News