కేటీఆర్ కే బూమరాంగ్.. ఆ శునకాన్ని తరిమేశారని కౌంటర్ ట్వీట్లతో నెటిజన్ల ఫైర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ ట్విట్టర్‌లో చాలా చురుకుగా ఉంటారని అందరికీ తెలిసిన విషయమే.
దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ ట్విట్టర్‌లో చాలా చురుకుగా ఉంటారని అందరికీ తెలిసిన విషయమే. ఇవాళ ట్విట్టర్ వేదికగా కేటీఆర్ సంచలన ట్వీట్ చేశారు. పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారని, సుమతి శతకంలో భాగంగా బద్దెన రాసిన ‘కనకపు సింహాసనమున శునకము గూర్చుండబెట్టిన శుభ లగ్నమునం దొనరగ బట్టము గట్టిన వెనుకటి గుణమేల మాను? వినురా సుమతీ’ అనే పద్యాన్ని ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు సీఎం రేవంత్ రెడ్డికి కౌంటర్ అంటూ కామెంట్స్ పెడుతుండగా ఎక్కువ మంది మాత్రం పదేళ్లు అధికారంలో కూర్చున్న మీకే ఈ పద్యం సరిపోతుంది అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
‘శునకాలు నీలా మొరుగుతాయ్, సింహాలు గర్జిస్తాయి.. తెలంగాణ ప్రజలు విజ్ఞులు కాబట్టే నిన్ను మీ అయ్యను, ఆ డొక్కు కారును షెడ్ కి పంపారు’ అని ఓ నెటిజన్ రిప్లై ఇచ్చారు. ‘అందుకే ఆ శునకాలను తరిమే తీర్పు ఇచ్చారు ప్రజలు. ఈ రోజు పిచ్చి పట్టి మొరుగుతున్నాయి’ అని ఇంకో నెటిజన్ తిరిగి కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలోనే కేటీఆర్‌కు వ్యతిరేకంగా చాలా మంది నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ కౌంటర్ ట్వీట్ వేస్తున్నారు. దీంతో కేటీఆర్ వేసిన ట్వీట్ ఆయనకే బూమరాంగ్ అయ్యింది.