బంగ్లాదేశ్ పరిస్థితులపై CPI నారాయణ షాకింగ్ కామెంట్స్

బంగ్లాదేశ్‌లో విద్యార్థులు చేస్తున్న ఉద్యమంపై సీపీఐ జాతీయ నేత నారాయణ ప్రశంసల వర్షం కురిపించారు.

Update: 2024-08-05 14:46 GMT

దిశ, వెబ్‌డెస్క్: బంగ్లాదేశ్‌లో విద్యార్థులు చేస్తున్న ఉద్యమంపై సీపీఐ జాతీయ నేత నారాయణ ప్రశంసల వర్షం కురిపించారు. సోమవారం నారాయణ మీడియాతో మాట్లాడారు. బంగ్లాదేశ్‌ విద్యార్థులకు అభినందనలు చెప్పారు. మాజీ ప్రధాని షేక్ హసీనా నియంతృత్వ ధోరణితో వ్యవహరించడం వల్లే దేశంలో ప్రతిపక్ష పార్టీలు అన్నీ కలిసి ఎన్నికలను బహిష్కరించాయని అన్నారు. హసీనా ఏకపక్షంగా ఎన్నికల్లో గెలిచారని తెలిపారు. ఏకపక్షంగా వ్యవహరించడం మూలంగానే బంగ్లాదేశ్‌లో ప్రభుత్వం పతనమైందని అన్నారు. నియంతలా ఫీలయ్యే అందరూ ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు.

కాగా, బంగ్లాదేశ్‌లో విద్యార్థులు చేపట్టిన శాంతియుత నిరసన హింసాత్మకంగా మారింది. సివిల్ సర్వీసెస్ ఉద్యోగాల్లో కోటా రద్దు చేయాలన్న డిమాండ్‌తో గత నెలలో మొదలయ్యాయి. చివరకు ఈ నిరసనలు ప్రభుత్వ వ్యతిరేకంగా మారాయి. చివరకు ప్రధాని పదవి నుంచి షేక్‌ హసీనా తప్పుకోవాలంటూ నిరసనకారులు ఉద్యమించారు. చివరకు సోమవారం ప్రధాని పదవికి షేక్‌ హసీనా రాజీనామా చేసి ఆర్మీ హెలికాప్టర్‌లో దేశం విడిచి పారిపోవాల్సిన పరిస్థితి ఎదురైంది. ఇప్పటికే ఘర్షణల్లో 300 మందికిపైగా నిరసన దుర్మరణం చెందారు.

Tags:    

Similar News