ఎవరికి సపోర్ట్ చేస్తావ్ మోడీ.. పాపాత్ముడికా..? రెజ్లర్లకా?

లైంగిక వేధింపులు ఆరోపణలు ఎదుర్కుంటున్న రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా చీఫ్‌, బీజేపీ ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ను అరెస్ట్‌ చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్‌ చేశారు.

Update: 2023-05-19 15:47 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: లైంగిక వేధింపులు ఆరోపణలు ఎదుర్కుంటున్న రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా చీఫ్‌, బీజేపీ ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ను అరెస్ట్‌ చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో ధర్నా చేస్తున్న రెజ్లర్లను సీపీఐ జాతీయ నాయకులు కలిసి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. తమపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయని మహిళా మల్ల యోధులు.. ఎంత బాధ ఉంటే బయటకు వచ్చి ధర్నా చేస్తారని ఆవేదన వ్యక్తంచేశారు. బీజేపీ ప్రభుత్వం పైన వారు ఉడుము పట్టు పట్టినట్లు ధర్నా చేస్తున్నారని అన్నారు.

హిందూ సంప్రదాయం అని చెప్పుకునే బీజేపీ, ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ సంస్థలు రెజ్లర్లకు సపోర్ట్ చేయకుండా ద్రోహం చేస్తోందని మండిపడ్డారు. రెజ్లర్లు మెడల్స్ తీసుకువస్తే దేశానికి మంచి పేరు వస్తదని, కానీ బీజేపీ నేత బ్రిజ్ భుషన్‌కు సపోర్ట్ చేస్తే మంచి పేరు రాదని విమర్శించారు. ప్రధాని మోడీ ఈ బ్రిజ్ భుషన్‌ను అరెస్టు చేయించి జైల్లో పెట్టాలని, ఆందోళన చేస్తున్న రెజ్లర్లకు మోడీ ఆత్మస్థైర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. దేశానికి పతకాలు సాధించే రెజ్లర్లకు సపోర్ట్ చేస్తారా? లేక ఒక పాపాత్ముడికి సపోర్ట్ చేస్తావా తేల్చుకోవాలని నిలదీశారు.

Tags:    

Similar News