Munugode bypoll: బండి సంజయ్ కు సీపీఐ నారాయణ కౌంటర్

CPI Narayana Slams Bandi Sanjay Over Munugode bypoll| కమ్యూనిస్టు పార్టీలకు దమ్ముంటే మునుగోడు ఉపఎన్నికలో పోటీ చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన కామెంట్లపై సీపీఐ నారాయణ మండిపడ్డారు. మునుగోడులో పోటీ చేయాలా? వద్దా? అనేది తాము తేల్చుకుంటామని అన్నారు. తమ గురించి

Update: 2022-08-12 07:00 GMT
Bandi Sanjay Responds On Choutuppal Wall Posters issue
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: CPI Narayana Slams Bandi Sanjay Over Munugode bypoll| కమ్యూనిస్టు పార్టీలకు దమ్ముంటే మునుగోడు ఉపఎన్నికలో పోటీ చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన కామెంట్లపై సీపీఐ నారాయణ మండిపడ్డారు. మునుగోడులో పోటీ చేయాలా? వద్దా? అనేది తాము తేల్చుకుంటామని అన్నారు. తమ గురించి చెప్పడానికి నువ్వెవడివి కోన్ కిస్కావి అంటూ నిప్పులు చెరిగారు. తమ గురించి మాట్లాడే ముందు బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకోవాలని, ఢిల్లీ నుండి వచ్చిన దమ్మే తప్ప ఇంకేమీ లేని మీరు మా పార్టీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పార్టీ పరంగా తాము చర్చించుకుని మునుగోడులో పోటీ చేయాలా వద్దా అనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అంతే గానీ నీ సలహాలు మాకు అక్కర్లేదన్నారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బుధవారం బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే కమ్యూనిస్టు పార్టీలు మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని సవాల్ చేశారు. కమ్యూనిస్టు, మజ్లీస్ పార్టీల నాయకులు సీఎం కేసీఆర్ కు కోవర్టుల్లా మారారని మండిపడ్డారు. రాజకీయంగా వీరు టీఆర్ఎస్ లబ్దికోసం పని చేస్తున్నారని.. నిజంగా దమ్ము, ధైర్యం ఉంటే మునుగోడులో పోటీ చేసి నిరూపించుకోవాలని సవాల్ చేశారు. ఈ కామెంట్స్ పై సీపీఐ నారాయణ కౌంటర్ ఇస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ము, ధైర్యం గురించి మాట్లాడే అర్హత బండి సంజయ్ కి ఎక్కడిదని ప్రశ్నించారు. 

ఇది కూడా చదవండి: మంత్రితో ఎంఎల్సీ కల్వకుంట్ల కవిత భేటీ.. నిధులపై చర్చ

Tags:    

Similar News