ధరణి పెను భూతం: ఎమ్మెల్యే కూనంనేని

గత బీఆర్ఎస్​పాలకులు తీసుకొచ్చిన ధరణి పెను భూతం అని సీపీఐ సభాపక్ష నేత, కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు పేర్కొన్నారు...

Update: 2025-03-26 16:25 GMT

దిశ, తెలంగాణబ్యూరో : గత బీఆర్ఎస్​పాలకులు తీసుకొచ్చిన ధరణి పెను భూతం అని సీపీఐ సభాపక్ష నేత, కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాలలో భాగంగా బుధవారం ఆయన సభలో మాట్లాడుతూ.. గత పాలకులు తీసుకొచ్చిన ధరణితో రైతులు అనేకానేక ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చిందన్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణిలో కాస్తుకాలం లేకుండా చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ తప్పును తిరిగి చేయవద్దని సూచించారు. భూ భారతిలో కాస్తుకాలం తప్పనిసరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కాస్తుకాలం వల్ల భూ యాజమానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. అలాగే సాధా బైనామకు మళ్లీ అవకాశమచ్చి లక్షలాది మందికి న్యాయం చేయాలన్నారు.

ఇకపోతే కౌలు రైతుల కోసం నాడు వైఎస్​రాజశేఖర్​రెడ్డి ప్రత్యేకించి కార్డులు ఇచ్చారని గుర్తు చేశారు. ఆ కార్డులను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. దీనివల్ల పంటలు దెబ్బతిన్నప్పుడు, విత్తనాలతో నష్టం వాటిట్లునప్పుడు వారికి ప్రభుత్వపరంగా అందే సాయానికి ఉపయోగకరంగా ఉంటుందని వ్యాఖ్యనించారు. అలాగే, రాష్ట్రంలో శాంతిభద్రతల విషయంలో పోలీసు పనితీరు భాగుందని, కానీ పోలీసు విధానంలోనే మార్పులు తీసుకురావాలని, ప్రభుత్వ పరంగా వారికి అందాల్సిన వాటన్నింటినీ ప్రభుత్వం అందజేయాలన్నారు. నీళ్ల విషయంలో అందుబాటులో నీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం దృష్టి సారించాలని, ముఖ్యంగా ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి నీళ్లను నింపి సాగునీటి అవసరాలు తీర్చాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో అర్హులైన వారికి న్యాయంగా ఇండ్లు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.

ముఖ్యంగా జర్నలిస్టుల కోసం ప్రత్యేక పాలసీని తీసుకొచ్చి వారికి సైతం ఇండ్లు, ఇతర్రత మౌళిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం తొడ్పాటును అందించాలని కూనంనేని సాంబశివరావు సూచించారు. ఇదిలాఉండగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరు చాలా బాధాకరంగా ఉందని ఆయన వ్యాఖ్యనించారు. పొలిటికల్ కామెంట్స్‌కు అసెంబ్లీ వేదిక కాదని, విమర్శలు ఎవరు చేసినా తప్పే అని ఆయన పేర్కొన్నారు. బీఆర్​ఎస్​వర్కింగ్​ప్రెసిడెంట్​ కేటీఆర్ కమిషన్లు అని వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదని కూనంనేని సూచించారు.

Similar News