ఫాంహౌస్ కేసులో నిందితుడు నందకుమార్ కస్టడీకి కోర్టు అనుమతి

అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రధాన నిందితుడు నందకుమార్‌ కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతినిచ్చింది.

Update: 2022-11-28 06:07 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రధాన నిందితుడు నందకుమార్‌ కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతినిచ్చింది. నందకుమార్‌ను రెండు రోజుల పాటు పోలీస్ కస్టడీకి తీసుకోవాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. అయితే, నిందితుడు నందకుమార్‌పై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో మూడు చీటింగ్ కేసులు నమోదయ్యాయి. దీంతో, బంజారాహిల్స్ పీఎస్‌లో నమోదైన కేసులో నందకుమార్‌ను పోలీస్ కస్టడీకి ఇవ్వాలని కోరగా...రెండు రోజుల పాటు కస్టడీకి అనుమతినిస్తూ నాంపల్లి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. నేడు, రేపు నందకుమార్‌ను కస్టడీకి తీసుకుని బంజారాహిల్స్ పోలీసులు ప్రశ్నించనున్నారు. ఈ క్రమంలో నందకుమార్‌ను చంచల్‌గూడ జైలు నుంచి బంజారాహిల్స్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఇప్పటికే ఎమ్మె్ల్యేల కొనుగోలు కేసులో నిందితుడుగా విచారణను ఎదుర్కుంటున్న నందకుమార్ తాజాగా బంజారాహిల్స్‌ పీఎస్‌లో నమోదైన కేసులో విచారణ ఎదర్కోనున్నాడు.

Read More: MLA Purchase Case: ఎమ్మెల్యేలకు ఎర కేసు: దూకుడు పెంచిన సిట్

Read More: మరోసారి విచారణకు నందకుమార్ భార్య చిత్రలేఖ 

Tags:    

Similar News