Drugs : హైదరాబాద్ టూ న్యూజిలాండ్‌కు డ్రగ్స్ కొరియర్.. ఎఫిడ్రిన్ డ్రగ్స్ స్వాధినం
హైదారాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. నగరంలో డీఆర్ఐ అధికారులు ఇవాళ భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో: హైదారాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. నగరంలో డీఆర్ఐ అధికారులు ఇవాళ భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. హైదరాబాద్ నుంచి న్యూజిలాండ్‌కు డ్రగ్స్ కొరియర్ చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సుమారు రూ. 60 లక్షల విలువైన 3 కిలోల ఎఫిడ్రిన్ డ్రగ్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. పొడి రూపంలో ఉన్న రెండు డ్రగ్స్ ప్యాకెట్లు స్వాధినం చేసుకున్నారు.
నిందితులను అదుపులోకి తీసుకుని ఎన్‌డీపీఎస్ చట్టం కింద వారిపై కేసు నమోదు చేశారు. కాగా, తెలంగాణ సర్కార్ డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో డ్రగ్స్ దందా.. పబ్‌లు, అక్రమ రవాణాపై నిఘా ఏర్పాటు చేశారు. డ్రగ్స్‌ను పూర్తి స్థాయిలో కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పదార్థాలు అమ్మకం, వాడకం, రవాణా లాంటి సమాచారం అందిన వెంటనే ఎక్కడికక్కడ అధికారులు మెరుపు దాడులు చేస్తున్నారు. ఎక్కడి నుంచి మాదకద్రవ్యాలు తెస్తున్నారు.. లాంటి విషయాలపై దర్యాప్తు చేపడుతున్నారు.