Musi River: మూసీ నిర్వాసిత రైతులందరికీ ఎంపీ చామల కీలక పిలుపు

మూసీ ప్రక్షాళనను అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని చామల కిరణ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు.

Update: 2024-10-04 05:50 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: మూసీ ప్రక్షాళనను అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. పూర్వం సాగు, తాగు నీటి అవసరాలకు ఉపయోగపడిన మూసీ నది మానవ తప్పిదాల వల్ల కాలుష్యం కోరల్లో చిక్కుకుపోయి దుర్గంధం వెదజల్లుతోందన్నారు. మూసీ నది ప్రక్షాళన గురించి చర్చించేందుకు ఈనెల 5వ తేదీన సాయంత్రం 4 గంటలకు నాగోల్ శుభం గార్డెన్ లో నిర్వహించే రైతు సమావేశానికి ఉమ్మడి నల్గొండ జిల్లా రైతులతో పాటు మూసీ పరివాహక ప్రాంతంలోని రైతులంతా హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మూసీపై చర్చించి ప్రతిపక్షాల కుట్రలను తిప్పికొడదామన్నారు. గోదావరి జలాలను మూసీలో ప్రవహించేయాలని ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు. గతంలో ఫ్లోరైడ్ సమస్యను అధిగమించిన మనమంతా ఇప్పుడు మూసీ నది ప్రక్షాళన విషయంలో నడుము బిగించాలని, మూసీ ప్రక్షాళనకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.


Similar News