కాంగ్రెస్‌ను కూల్చడానికి ఆ రెండు పార్టీల కుట్ర: మంత్రి జూపల్లి ఫైర్

బీజేపీ‌తో బీఆర్ఎస్ చీకటి ఒప్పందం చేసుకొని కాంగ్రెస్‌ను కూల్చాలని చూస్తున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు ఫైర్ అయ్యారు.

Update: 2024-07-07 10:48 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: బీజేపీ‌తో బీఆర్ఎస్ చీకటి ఒప్పందం చేసుకొని కాంగ్రెస్‌ను కూల్చాలని చూస్తున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు ఫైర్ అయ్యారు. రాజ్యాంగాన్ని నిలబెట్టడం కోసమే తమ ప్రయత్నమని ఆయన అన్నారు. ఆదివారం మంత్రి జూపల్లి కృష్ణారావు సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగం ప్రకారం బీఆర్ఎస్ నడుచుకుంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది కాదని అభిప్రాయపడ్డారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకే కాంగ్రెస్‌కు ప్రజలు అధికారం ఇచ్చారన్నారు. అవినీతి సంపాదనతో ఆనాడు కేసీఆర్ పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని అన్నారు. లంగయేషాలు, అవినీతి, దొంగేశాలు, రాచరిక వ్యవస్థతో పాలన సాగింది కాబట్టే ప్రజలు తప్పు చేయకుండా మిమ్మల్ని దించితే ప్రజలు తప్పు చేశారంటూ మాట్లాడుతున్నారని చెప్పారు. నిరంజన్ రెడ్డి నీతులు వల్లిస్తుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని విమర్శించారు.

ప్రజలు కాంగ్రెస్ పాలనను మెచ్చే కేసీఆర్‌కు పార్లమెంటులో సున్నా ఇచ్చారన్నారు. ఇక గ్లాసులో మందు పోసినందుకే కొడుకు సంతోష్ కు రాజ్యసభ ఇచ్చినప్పుడు ఎందుకో మాట్లాడలేదని నిరంజన్ రెడ్డిని నిలదీశారు. కేసీఆర్‌కు లెటర్ వ్రాయాల్సిఉండే నీ వల్ల మేము బ్రష్టు పట్టామని అని అన్నారు. కేసీఆర్, నిరంజన్ రెడ్డిలకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రాహుల్‌ను విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. ఇప్పటికైనా పిచ్చి పిచ్చి మాటలు కేసీఆర్, నిరంజన్ రెడ్డిలు మానుకోవాలని సూచించారు.

Tags:    

Similar News