బండి అరెస్ట్‌పై ట్విట్టర్‌లో స్పందించిన కేటీఆర్
తెలంగాణలో విధ్వంసకర వాతావరణాన్ని సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని బీఆర్ఎస్ నేతలు మండిపతుడున్నారు.
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో విధ్వంసకర వాతావరణాన్ని సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని బీఆర్ఎస్ నేతలు మండిపతుడున్నారు. హిందీ పేపర్ ను బండి వాట్సాప్ కు పంపించడం కుట్ర కాదా అని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో సంచలనంగా మారిన బండి అరెస్ట్ పై కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. బండి అరెస్ట్ పై ఓ వ్యక్తి చేసిన ట్వీట్ ను రీ ట్వీట్ చేసిన మంత్రి.. ఆ ట్వీట్ లో పేపర్ లీక్ కుంభకోణాల వెనుక బీజేపీ నేతల హస్తం ఉందని చెప్పడానికి ఇది మరో నిదర్శనం అంటూ పేపర్ లీక్ చేసిన నిందితుడు, బీజేపీ నేతలతో సన్నిహితంగా ఉన్న ఫోటోలను షేర్ చేశారు.
ఇక వాట్సాప్ గ్రూపుల్లో పేపర్ వైరల్ చేసిన నిందితుడు బండి సన్నిహితుడు అంటూ అందులో పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని అస్థిర పరిచే కుట్ర జరుగుతోందని ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ ఫైర్ అయ్యారు. బండి సంజయ్ పై నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ సంచలన కామెంట్స్ చేశారు. పేపర్ లీకేజ్ లో అతిపెద్ద కుట్రదారు బండి సంజయ్ అన్నారు. బండి సంజయ్ వాట్సాప్ కే పేపర్ వెళ్లిందన్నారు. బీజేపీ వాట్సాప్ గ్రూప్ కుట్ర పూరితంగా తెలంగాణలో సంక్షోభం సృష్టించానలి చూస్తోందన్నారు.
It meets larger than the eye. Since it’s an Election year in #Telangana, the #BJP has hatched a conspiracy to indulge in mudslinging against TS Govt & to tarnish the image of Hon’ble CM #KCR Garu.
— Putta Vishnuvardhan Reddy (@PuttaVishnuVR) April 4, 2023
FACT👇
Whether it’s the #TSPSC paper leak or the 10th Class Hindi paper leak, in… pic.twitter.com/lTpQ9bW46t