కాంగ్రెస్ యువ పోరాట యాత్ర.. రేపటి నుంచి షురూ
కాంగ్రెస్ యువ పోరాట యాత్ర రేపటి నుంచి మొదలు కానున్నది. సీఎం కేసీఆర్ అసెంబ్లీ సెగ్మెంట్ గజ్వేల్‌నుంచి ప్రారంభించనున్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ యువ పోరాట యాత్ర రేపటి నుంచి మొదలు కానున్నది. సీఎం కేసీఆర్ అసెంబ్లీ సెగ్మెంట్ గజ్వేల్‌నుంచి ప్రారంభించనున్నారు. 33 జిల్లాల్లో 33 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగనున్నది. యూత్ కాంగ్రెస్ఆధ్వర్యంలో ఈ యాత్ర జరగనున్నది. ఈ సందర్భంగా యూత్‌కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగాలు లేక నిరుద్యోగ యువత అల్లాడుతున్నారన్నారు. నిరుద్యోగులు టీఎస్పీఎస్సీని దేవాలయంగా భావిస్తారని, కానీ అలాంటి బోర్డు నిరుద్యోగుల పాలిట శాపంగా మారుతుందన్నారు. ప్రతిసారి నిర్లక్ష్యంతో విద్యార్ధులు, నిరుద్యోగులను ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు.
టీఎస్‌పీఎస్సీనీ కేసీఆర్బ్రోతల్ కంపెనీగా మార్చారన్నారు.కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇచ్చి, రెగ్యులర్జాబ్స్ఇచ్చినట్లు ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుందన్నారు. ఇంత కంటే మోసం మరోకటి ఉండదన్నారు. ఇక ప్రభుత్వం కొత్తగా కట్టిన కలెక్టర్కార్యాలయాల్లో ఉద్యోగులు లేక ఖాళీలు వెక్కిరిస్తున్నాయన్నారు. కేసీఆర్ హామీ ఇచ్చిన ప్రకారం ఇప్పటి వరకు ప్రతి నిరుద్యోగికి ప్రభుత్వ లక్షా అరవై వేల బకాయి లు ఉన్నదన్నారు. ప్రజలకు ఈ విషయం అర్థమయ్యే రీతిలో వివరించేందుకే ఈ యాత్రను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. నిరుద్యోగం, ఉపాధి, కమీషన్లు, ప్రభుత్వ వైఫల్యాలను ఈ యాత్రలో వివరిస్తామన్నారు.