Hanumantha Rao : విభజన రాజకీయాలను అడ్డుకునేందుకు కాంగ్రెస్ ను గెలిపించాలి : వీహెచ్

దేశంలో బీజేపీ, ప్రధాని మోడీలు సాగిస్తు్న్న విభజన రాజకీయాలను అడ్డుకునేందుకు మహారాష్ట్ర ఎన్నికలతో సహా దేశంలో రాహుల్ గాంధీ(Rahul Gandhi) ని బలపరిచి కాంగ్రెస్(Congres)ను గెలిపించాల్సిన అవసరముందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి.హనుమంతరావు(V. Hanumantha Rao) అన్నారు

Update: 2024-11-11 10:52 GMT

దిశ, వెబ్ డెస్క్ : దేశంలో బీజేపీ, ప్రధాని మోడీలు సాగిస్తు్న్న విభజన రాజకీయాలను అడ్డుకునేందుకు మహారాష్ట్ర ఎన్నికలతో సహా దేశంలో రాహుల్ గాంధీ(Rahul Gandhi) ని బలపరిచి కాంగ్రెస్(Congres)ను గెలిపించాల్సిన అవసరముందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి.హనుమంతరావు(V. Hanumantha Rao) అన్నారు. గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. దేశాన్ని హిందూ ముస్లింలుగా బీజేపీ విడగొట్టలని చూస్తుందని ఆరోపించారు. మొన్నటి వరకు మతాల పేరిట విడదీస్తే.. ఇప్పుడు కులాల పేరిట చిచ్చు పెట్టీ రాజకీయాలు మోడీ చేస్తున్నాడని, పదేళ్లలో మోడీ ఏం చేశాడో చెప్పకుండా.. కాంగ్రెస్ ఏం చేయలేదు అంటూ ప్రచారం చేస్తున్నారన్నారు. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల్లో బీజేపీ ప్రజలకు ఏం చేసిందో చెప్పడం లేదన్నారు. తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక ల నుంచి ఎన్నికలకు డబ్బులు వస్తున్నాయని మోడీ ఆరోపిస్తూ తన పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్ళీస్తున్నారని విమర్శించారు. కుల గణనతో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ అని రాహుల్ గాంధీ అంటుంటే మోడీ విభజన అంటున్నాడని, గాంధీ కుటుంబానిది రాజరిక పాలన అంటున్నాడని వీహెచ్ తప్పుబట్టారు. దేశం కోసం త్యాగాలు చేసిన ఇందిరా గాంధీ కుటుంబం మీద మోడీకి ఎందుకు అంత కోపమని ప్రశ్నించారు.

పేదరికం నుంచి 25కోట్ల మందిని పైకి తీసుకువచ్చామని మోడీ అంటున్నాడని, ఆ వివరాలు బయటపెట్టండని డిమాండ్ చేశారు. బీజేపీ లోకి సృజన చౌదరి.. సీఎం రమేష్ ల పై అవినీతి ఆరోపణలు ఉన్న ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు. ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్ 10శాతం తీసుకువస్తే మేము అడ్డుకోలేదన్నారు. సమగ్ర కుటుంబ సర్వే చేసిన వాళ్ళు కూడా కుల గణన సర్వేను వ్యతిరేకిస్తుండటం విడ్డూరమన్నారు. బీఆర్ ఎస్ వాళ్లు వారి పాలనలో చేసిన సర్వే రిపోర్ట్ బయటపెట్టండని డిమాండ్ చేశారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో రెండు రోజులు పాల్గొంటానని తెలిపారు. తెలుగు మాట్లాడే ప్రజలు ఉన్న ప్రాంతాల్లో ప్రచారం చేస్తానని వీహెచ్ ప్రకటించారు. 

Tags:    

Similar News