కాంగ్రెస్ స్పీడ్.. ఈ నెల 6న మరో పీఈసీ సమావేశం.. ఎందుకంటే?
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై తెలంగాణ కాంగ్రెస్ వేగం పెంచింది.
దిశ, డైనమిక్ బ్యూరో: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై తెలంగాణ కాంగ్రెస్ వేగం పెంచింది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు 17 నియోజకవర్గాలకు గాను దాదాపు 306 అప్లికేషన్లు వచ్చాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ వచ్చిన దరఖాస్తులను మొదట పీఈసీ (ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ) ఫిల్టర్ చేయనున్నది.
ఈ క్రమంలోనే ఎంపీ అభ్యర్థుల ఎంపికపై ఈ నెల 6న గాంధీ భవన్ లో పీఈసీ సమావేశం మరోసారి కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న పీఈసీ సమావేశంలో లోక్‌సభ ఎన్నికల కార్యాచరణ, మెజార్టీ గెలుపు వ్యూహాలపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో ఏఐసీసీ, పీఈసీ సభ్యులు పాల్గొంటారు.