కేటీఆర్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యేల హెచ్చరిక

కేటీఆర్ మతి తప్పి మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. సోమవారం ఆయన అసెంబ్లీ హాల్‌లో మీడియాతో మాట్లాడారు.

Update: 2024-02-26 16:53 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కేటీఆర్ మతి తప్పి మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. సోమవారం ఆయన అసెంబ్లీ హాల్‌లో మీడియాతో మాట్లాడారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కర్రు కాల్చివాత పెట్టినా కేటీఆర్‌కు బుద్ధి రాలేదన్నారు. రైతు బిడ్డ రేవంత్ రెడ్డి సీఎం అవడాన్ని కేటీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నాడని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డిపైన కేటీఆర్ మాటలు ఆయన దురంహకారానికి నిదర్శనమన్నారు.

కేటీఆర్ నోరు అదుపులోకి పెట్టుకోకపోతే కాంగ్రెస్ కార్యకర్తలు తాట తీస్తారన్నారు. దుగానే సీఎం రేవంత్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించి ఉంటే బీఆర్ఎస్ కూడా మూడు సీట్లు కూడా వచ్చేవి కావాన్నారు. 80కి పైగా ప్రచార సభలలో రేవంత్ రెడ్డి ముందుండి కాంగ్రెస్‌ను గెలిపించారన్నారు. కృష్ణా జలాల పాపం బీఆర్ఎస్ పార్టీదే అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఒక్క సీటు కూడా రాదన్నారు. అడ్లూరి లక్ష్మణ్​మాట్లాడుతూ.. కేటీఆర్‌కు మదం ఎక్కి, అహంకారంతో మాట్లాడుతున్నాడన్నారు.

Tags:    

Similar News