హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం ఫైర్

జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా ఏర్పాటైన హైడ్రా అక్రమ నిర్మాణాలు, కబ్జాలపై ఉక్కుపాదం మోపుతుంది.

Update: 2024-08-13 07:02 GMT

దిశ, వెబ్ డెస్క్: జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా ఏర్పాటైన హైడ్రా అక్రమ నిర్మాణాలు, కబ్జాలపై ఉక్కుపాదం మోపుతుంది. ఈ క్రమంలో హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ సోమవారం మీడియా సమావేశం నిర్వహించిన మరి అక్రమార్కులపై చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్ - నందగిరి హిల్స్, గురు బ్రహ్మ నగర్ లో జీహెచ్ఎంసీ పార్క్ లో కట్టిన కాంపౌండ్ గోడను కూల్చారని కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై, అతని అనుచరులపై డీవీఎం అధికారుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌పై ఫైర్ అయ్యారు. మంగళవారం ఉదయం ప్రెస్ మీట్ పెట్టిన ఆయన.. రంగనాథ్‌కు కొత్తగా వచ్చిన పదవి ఇష్టం లేనట్టుందని.. అందుకే తనపై కేసు పెట్టారని ఎద్దేవ చేశారు. అలాగే అధికారులు వస్తుంటారు..పోతుంటారు.. కానీ తాను మాత్రం లోకల్ అని చెప్పుకొచ్చారు. నందగిరి హిల్స్‌ హుడా లేఔట్‌ ఘటనపై సదరు అధికారులకు ప్రివిలేజ్‌ నోటీసులు ఇస్తానని.. తనపై తప్పుడు ఆరోపణలు చేసిన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని.. ఇదే విషయంపై సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేస్తామని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News