ముగిసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్.. బీఆర్ఎస్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో నీటిపారుదల శాఖపై నిర్వహించిన పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ముగిసింది.

Update: 2024-02-11 16:28 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో నీటిపారుదల శాఖపై నిర్వహించిన పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ముగిసింది. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య మీడియాతో మాట్లాడారు. కృష్ణా జలాలపై రేపు అసెంబ్లీలో స్పష్టత ఇస్తామని తెలిపారు. రేపు తాము అడగబోయే ప్రతీ ప్రశ్నకు బీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ నీళ్లను ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆ రాష్ట్రానికి తరలించుకుపోయారని అన్నారు.

నీళ్ల విషయంలో కేసీఆర్ సాయం చేశారని స్వయంగా జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ వేదికగా వెల్లడించారని గుర్తుచేశారు. ఎన్నికల వేళ కేవలం ఓట్ల కోసమే నాగార్జున సాగర్‌ మీదకు పోలీసులను పంపి డ్రామాలు ఆడారని మండిపడ్డారు. మరోసారి సెంటిమెంట్‌ను వాడుకొని గద్దెను ఎక్కుదామనుకున్న కేసీఆర్‌కు ప్రజలు సరిగ్గా బుద్ధి చెప్పారని అన్నారు. ప్రాజెక్టు్ల్లో భారీగా దోచుకొని ఎన్నికల్లో ఖర్చు పెట్టారని తెలిపారు. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో సీఎం రేవంత్‌ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, కాంగ్రెస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. రాష్ట్ర ఇరిగేషన్‌ శాఖపై సమగ్రంగా చర్చించారు. 

Tags:    

Similar News