కేసీఆర్ కను సైగల‌తోనే ఫోన్ ట్యాపింగ్: చనగాని దయాకర్

బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో పొలిటికల్ లీడర్లతో పాటు ప్రజలూ తీవ్ర సమస్యలు ఎదుర్కొన్నారని టీపీసీసీ స్పోక్స్ పర్సన్, గ్రంథాలయ చైర్మన్

Update: 2024-05-29 14:18 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో పొలిటికల్ లీడర్లతో పాటు ప్రజలూ తీవ్ర సమస్యలు ఎదుర్కొన్నారని టీపీసీసీ స్పోక్స్ పర్సన్, గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ రియాజ్ పేర్కొన్నారు. బుధవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వం వ్యక్తుల స్వేచ్ఛను హరించిందన్నారు. ఫోన్ల ట్యా్ంపరింగ్ ద్వారా వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి దుర్వినియోగానికి పాల్పడ్డారన్నారు. ఇది అత్యంత దారుణమన్నారు. ఇలాంటి పరిస్థితులు ఎన్నడూ రాలేదన్నారు. అరెస్టైన ఆఫీసర్ల ఆస్తులు వెంటనే స్వాధీనం చేసుకోవాలన్నారు. ఆఫీసర్ల సర్వీసునూ రద్దు చేయాల్సిన అవసరం ఉన్నదని వివరించారు.

టీపీసీసీ స్పోక్స్ పర్సన్ చనగాని దయాకర్ మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనలో ర్యాలీ, నిరసనలు వంటివి చేస్తే, పోలీసులు అనేక ఇబ్బందులకు గురి చేశారన్నారు. ఏదైనా కార్యక్రమం చేపడితే రాత్రిళ్లు వచ్చి సోదాలు చేసి సమస్యలు సృష్టించారన్నారు. కేసీఆర్ చేసిన పాలన కంటే రజాకార్లే నయం అనే పరిస్థితులు కల్పించారన్నారు. కేసీఆర్ కన్ను సైగల‌తోనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నారు. ప్రతి ఎలక్షన్ లో ట్యాపరింగ్ ద్వారా ప్రతిపక్షాల ఇండ్లపై దాడి చేసి లూటీ చేశారన్నారు. హైదరాబాద్ లో తిరుగుతున్న చెడ్డీ గ్యాంగ్ లకు భుజంగరావు, ప్రభాకర్ రావు, ప్రణీత్ రావులకు తేడా లేదన్నారు. కేసీఆర్ పాలనలో పోలీస్ వ్యవస్థ దిగజారిందన్నారు. ఫోన్ ట్యాపరింగ్ పై బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బీఆర్ ఎస్ నేత కేటీఆర్ కూడా మాట్లాడటం లేదన్నారు.ఈ రెండు పార్టీలో కుమ్మక్కుతోనే అరాచకాలు జరిగాయన్నారు.


Similar News