జాతకం ఎలా ఉందో KCR వెంటనే చూసుకోవాలి.. రేణుకా చౌదరి కౌంటర్

ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిపై రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రఘురామిరెడ్డి చాలా మంచి అభ్యర్థి అని ప్రశంసించారు.

Update: 2024-04-25 13:46 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిపై రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రఘురామిరెడ్డి చాలా మంచి అభ్యర్థి అని ప్రశంసించారు. అభ్యర్థి విషయంలో ఉమ్మడి జిల్లాలోని కీలక నేతల అందరి వద్ద అభిప్రాయాలు సేకరించాకే అధిష్టానం నిర్ణయం తీసుకుందని అన్నారు. అధిష్టానం నిర్ణయం తీసుకున్న తర్వాత ఎవరూ తోకలు ఊపడానికి వీళ్లేదని తెలిపారు. అభ్యర్థుల ప్రకటన విషయంలో ఆలస్యం ఏం జరుగలేదని అన్నారు. ప్రభుత్వాలు కూల్చడం కాదు.. ముందు తన జాతకం ఎలా ఉందో చూసుకోవాలి అని కేసీఆర్‌కు కౌంటర్ ఇచ్చారు.

కేసీఆర్ కాలం చెల్లిన మెడిసిన్ అని.. ఆయన చేసిన కామెంట్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదని విమర్శించారు. కేసీఆర్‌కు అధికార దాహం ఎక్కువైందని ప్రజలకు తెలిసిన తర్వాతనే గద్దె దింపేశారని అన్నారు. అధికారదాహం ఒక రోగం అని.. దానిని తాము ఉచితంగానే నయం చేస్తామని అన్నారు. ప్రజలు పదేళ్లు అవకాశం ఇచ్చినా ఏనాడూ ఫామ్‌హౌజ్ వదిలి బయటకు రాని వ్యక్తి ఇంటర్వ్యూలు ఇవ్వడానికి మాత్రం వస్తున్నాడని ఎద్దేవా చేశారు. ఇంటర్వ్యూ పేరిట స్టూడియోకు రప్పించిన ఆ న్యూస్ ఛానల్‌కు కంగ్రాట్స్ అని రేణుకా చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇకనైనా కేసీఆర్ జోస్యం చెప్పడం మానేయాలని హితవు పలికారు.

Tags:    

Similar News