గజ్వేల్ నుంచే CM కేసీఆర్‌కు వీఆర్ఎస్: రేణుక చౌదరి తీవ్ర విమర్శలు

సీఎం కేసీఆర్ పాలనపై కేంద్ర మాజీమంత్రి రేణుకా చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Update: 2023-05-05 11:55 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: సీఎం కేసీఆర్ పాలనపై కేంద్ర మాజీమంత్రి రేణుకా చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. 9 ఏళ్ల పాలనలో తెలంగాణ ప్రజలకు అన్ని పంగనామాలు పెట్టారని ఆమె ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్‌కు గజ్వేల్ నుంచే వీఆర్ఎస్ ఇస్తామన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో రేణుకాచౌదరి పర్యటించారు. కొండ పోచమ్మ సాగర్ భూ నిర్వాసితులను ఆమె కలిశారు. నిర్వాసితులు చేస్తు్న్న నిరసనకు సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వంపై రేణుకాచౌదరి విరుచుకుపడ్డారు. సీఎం కేసీఆర్‌ పాలన మొత్తం అరాచకాలేనని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో మహిళలపై దాడులు జరుగుతుంటే తెలంగాణ ఆత్మ గౌరవం గుర్తుకురావడం లేదా అని ప్రశ్నించారు. కేసీఆర్ అరాచకాలు చూసి తెలంగాణ తల్లి కూడా సిగ్గుతో తలదించుకుంటుందని విమర్శించారు. టీఆర్ఎస్‌కు ఠాఠా చెప్పి.. బీఆర్ఎస్ పేరుతో దేశాలు తిరుగుతున్న కేసీఆర్‌ను ఈ గడ్డ నుంచి వీఆర్ఎస్ ఇచ్చి పంపించాలని కొండపోచమ్మ సాగర్ నిర్వాసితులకు రేణుకా చౌదరి పిలుపునిచ్చారు.

Tags:    

Similar News