బీఆర్ఎస్ అంటే బీజేపీ రిష్తేదార్ సమితి .. రాహుల్ గాంధీ
ఖమ్మంలో నిర్వహించిన తెలంగాణ జనగర్జన సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యల చేశారు.
దిశ, వెబ్ డెస్క్: ఖమ్మంలో నిర్వహించిన తెలంగాణ జనగర్జన సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యల చేశారు. బీఆర్ఎస్ పార్టీకి కొత్త నిర్వచనం ఇచ్చారు. బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ అంటే బీజేపీ రిష్తేదార్ సమితి అని రాహుల్ అన్నారు. తెలంగాణ స్వప్నాన్ని కాంగ్రెస్ పార్టీ నిజం చేస్తే.. సీఎం కేసీఆర్ మాత్రం ఈ తొమ్మిదేళ్లలో రాష్ట్రాన్ని లూటీ చేశారని అన్నారు. తెలంగాణను తన జాగీర్ చేసుకొని కేసీఆర్ దోచుకుంటున్నారని ఆరోపించారు. పార్టీ పేరులో నుంచి తెలంగాణ అని జోడించి కేసీఆర్ ప్రజలను మోసం చేశారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ప్రజలదని, దాన్ని తిరిగి ప్రజలకు అప్పగించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుందని చెప్పారు.
బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి బీ టీమ్ గా మారిందని అన్నారు. సీఎం కేసీఆర్ రిమోట్ ఇప్పుడు ప్రధాని మోడీ చేతిలో ఉందని, ఆయన ఏం చెబితే కేసీఆర్ అది చేస్తారని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒక్కటేనని, వాళ్లు చెప్పే మాటలను నమ్మొద్దని చెప్పారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించారని, అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీని ఓడించి కాంగ్రెస్ కు పట్టం కట్టాలని పిలుపునిచ్చారు.